డా.సంగెపాగు సరోజనమ్మకు అంతర్జాతీయ కీర్తి కిరీట టాలెంట్ అవార్డు ప్రదానం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సామాజిక సేవ రంగంలో విస్తృత సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ గుర్తింపు పొందిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డా.సంగేపాగు సరోజనమ్మా కు కన్నతల్లి ఫౌండేషన్ కీర్తి కిరీటి జాతీయ టాలెంట్ అవార్డు ఇచ్చి ఘనంగా సన్మానించింది. డా.సంగెపాగు సరోజనమ్మ తన ఆర్గనైజేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అనాధలకు, వృద్ధులకు,మహిళలకు, యువతి యువకులకు మరియు మతిస్థిమితం లేని వారికి చేసిన సేవలను గుర్తించి, అంకిత భావంతో అపారమైన సేవలందించినందుకు అసంఖ్యక కార్యక్రమాలు నిర్వహించి కర్తవ్యాన్ని నిర్వహణలో తన బాధ్యతను అమోఘంగా నిర్వర్తిస్తున్న ఆమెను అభినందిస్తూ ఆమెకు కీర్తి కిరీట అంతర్జాతీయ టాలెంట్ అవార్డును అందజేసినట్లు అధ్యక్షులు కొండమీద రాజన్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు కన్న తల్లి ఫౌండేషన్ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్మన్ సత్య శైలజ భారత్, కంచర్ల శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.