ఆయనకు 80.. ఆమెకి 23

.. ఇరువురిమద్య చిగురించిన ప్రేమ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కొన్ని కొన్ని సందర్భా్ల్లో వయసులో ఉన్న యువతీయువకులు.. వయసు మళ్లిన వృద్ధులను ప్రేమించడం, పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాగే.. ఓ యువతి కూడా వృద్ధుడిని ప్రేమించింది. తాత వయసు ఉన్న ఆ వృద్ధుడిని ప్రేమించిన యువతి.. ఎట్టకేలకు వారి ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో అది విని యువతి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ పెళ్లికి ఒప్పుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఈ సంఘటన చైనాలో జరిగింది.
చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఈ ప్రేమ కథ ప్రారంభం అయింది. ఆ ఓల్డేజ్ హోమ్‌లో ఉండే 80 ఏళ్ల లీ అనే వృద్ధుడు.. అదే వృద్ధాశ్రమంలో పనిచేసే 23 ఏళ్ల జియా ఫాంగ్‌ ప్రేమించుకున్నారు. మొదట పరిచయం పెంచుకున్న ఆ జంట.. ఆ తర్వాత మెల్లగా ప్రేమలోకి జారింది. ఆ తర్వాత జియా ఫాంగ్‌ను ప్రేమిస్తున్నానంటూ.. లీ అనే వృద్ధుడు తన మనసులో ఉన్న మాటను చెప్పేశాడు. అయితే లీ ప్రేమను.. జియా ఫాంగ్ అంగీకరించడం ఇందులో అతిపెద్ద ట్విస్ట్. తర్వాత వారిద్దరూ కొన్ని రోజుల పాటు గాఢమైన ప్రేమలో మునిగిపోయారు.

అయితే ఆ వృద్ధుడికి ఉన్న పరిణతి, జ్ఞానాన్ని ఇష్టపడిన జియా ఫాంగ్.. అతడిని ప్రేమించింది. ఇక ఆ యువతి అందానికి ఆకర్షితుడైన లీ.. ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇక తమ ప్రేమ విషయాన్ని.. ఆ జంట యువతి ఇంట్లో చెప్పేసింది. కానీ వారి పెళ్లికి.. యువతి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక.. ఆ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులతో సంబంధాలను తెంచుకుంది. చివరికి ఆ వృద్ధుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. చివరికి ఆ వృద్ధుడిని పెళ్లి చేసుకుంది.

అయితే లీ, జియా ఫాంగ్ పెళ్లికి.. యువతి కుటుంబ సభ్యులు ఎవరు హాజరు కాలేదని స్థానిక మీడియా వెల్లడించింది. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా వారి పెళ్లి.. చిన్న కార్యక్రమంలా జరిగింది.

Leave A Reply

Your email address will not be published.