బీజేపీ నేతతో కేటీఆర్ ఫోన్ లో సంభాషణ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు కోసం కేటీఆర్ బతిమిలాడుతున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో మునుగోడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేతతో ఫోన్ లో సంభాషించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో ఉన్న కీలకనేతలకు స్వయంగా ఫోన్లు చేసి మరీ తమకు సపోర్టు చేయాలనేంతగా.. తాజాగా మునుగోడులో ఓ బీజేపీనేతకు కేటీఆర్ చేసిన ఫోన్ కాల్ వీడియో లీక్ అయ్యింది. కేటీఆర్ సదురు బీజేపీ నేతకు ఫోన్ చేసి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి  ఏం చేశాడో మీకు తెలుసు.. ఆయన నిజమైన బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు.. ఈ ఎన్నికల్లో మాకు సహకరించండి.. మునుగోడులో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో బీజేపీ అదికారంలోకి రాదు.. పోయేది ఏం లేదు.పనిచేశాకే ఓట్లు అడుగుతున్నాం.. కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం.. మునుగోడులో మీరు బలమైన నేత అని తెలుసుకొని ఫోన్ చేశా‘ అంటూ కేటీఆర్ ఫోన్ లో సంభాషించారు.అయితే రైతు బంధ స్కీం బాగాలేదని.. కౌలురైతులకు ఇవ్వకుండా బడా రైతులకు ఇవ్వడం సరికాదని సదురు బీజేపీ నేత కౌంటర్ ఇచ్చాడు. పించన్లు భరగీథ పథకం బాగుందని అన్నారు. ఇదంతా పక్కనున్న వారు దాన్ని వీడియో తీసి బీజేపీ నేతలకు ఇవ్వడంతో అది వైరల్ అయ్యింది. కేటీఆర్ బీజేపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఇక అలాంటిదేం లేదని.. చేనేత నాయకుడితో కేటీఆర్ మాట్లాడారని.. అందులో తప్పేం లేదని టీఆర్ఎస్ బుకాయిస్తోంది. అయితే మంత్రి కేటీఆరే స్వయంగా బీజేపీ నేతకు ఫోన్ చేసి మాట్లాడడం.. తమకు సహకరించాలంటూ కోరడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.