హైదరాబాద్ లో భారీ వర్షం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైద్రాబాద్భా లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిల్మీంనగర్లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.
వర్షం ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.