పేకాట ఆడితే జైలుకే

నసురుల్లాబాద్ ఎస్సై రంజిత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండలంలోని కేంద్రంతోపాటు వివిధ గ్రామ ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాట ఆడిన ఆడించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపడం జరుగుతుందని, నస్రుల్లాబాద్ మండల్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు ,ఈ సందర్భంగ ఎస్సై రంజిత్ రెడ్డి ఓ పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలలో, లేక ఇండ్లలో, వ్యవసాయ బావులు వద్ద, దుకాణాలు సముదాయాల్లో ఎవరైనా పర్సనల్గా పేకాట క్లబ్బుని ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, ఎవరి స్థలంలోనైనా యజమానికి తెలిసిన తెలియకుండా ఎవరైనా పేకాడితే పోలీసులకు తెలియజేయాలన్నారు , లేకుంటే వారి పైన కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు, ఎక్కడైనా నివాస స్థలాలకు దూరంగా కాలువల్లో చెట్ల పొదల్లో పేకాట ఆడినట్టయితే స్థలం వారు పోలీసులకు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు,పేకాట ఆడి ఇల్లు గుల్ల చేసుకోవడం భార్య పిల్లలతో గొడవలు పడడం పచ్చని సంసారం సర్వనాశనం చేసుకోవడం జరుగుతుందని, ఇలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని నసురుల్లాబాద్ మండల్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు, మండల కేంద్రంతో పాటు , వివిధ గ్రామాలకు చెందిన ప్రజలకు వర్తిస్తుందని ఎస్సై రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.