అకాల మరణం చెందిన చిరంజీవి మాజీ అల్లుడు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. ఈ విషాదకర వార్త అందరిని షాక్ కి గురిచేస్తోంది. అతి పిన్నవయసులోనే శిరీష్ భరద్వాజ్ మృతి చెందడంతో అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శిరీష్ భరద్వాజ్, చిరు కుమార్తె శ్రీజ గతంలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  శ్రీజ, శిరీష్ భరద్వాజ్ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వార్త అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కొన్నేళ్ళకి వీరిద్దరూ విడిపోయారు. ఇటీవల శిరీష్ భరద్వాజ్ రెండవ వివాహం చేసుకున్నారు. అయితే శిరీష్ భరద్వాజ్ కొంతకాలంగా ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.   దీనితో శిరీష్ భరద్వాజ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనితో శిరీష్ కుటుంబ సభ్యులంతా విషాదంలో ఉన్నారు.  శ్రీజ, శిరీష్ భరద్వాజ్ కి ఒక కుమార్తె ఉంది. వీరిద్దరూ విడిపోయాక శ్రీజ తన కూతురితో కలసి చిరంజీవి వద్దే ఉంటున్నారు. అనంతరం శిరీష్ భరద్వాజ్ రెండవ వివాహం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.  ఒక యువ డాక్టర్ అయిన అమ్మాయిని శిరీష్ భరద్వాజ్ రెండవ వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది.  శ్రీజ, శిరీష్ భరద్వాజ్ వివాహం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే

Leave A Reply

Your email address will not be published.