ఇకనుండి కారులో వాటర్ బాటిల్ తీయడం మర్చిపోవద్దు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇక నుంచి.. పొరపాటున కూడా కారులో నుంచి బాటిల్ తీయడం మర్చిపోకండి. ఎందుకంటే.. అది చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఎంత ప్రమాదం అంటే.. ఏకంగా… కారులో మంటలు కూడా రావచ్చు. మీకు నమ్మసక్యంగా అనిపించకపోయినా ఇది అక్షరాలా నిజం.  నిజానికి నీరు.. మంటలను ఆర్పే గుణాన్ని కలిగి ఉంటుంది. కానీ… ఇదే నీరు కారులొ మంటలకు కారణం అవుతుందట.  నార్మల్ గా స్టీల్ బాటిల్స్ లో వాటర్ నింపుకొని ఉంచితే పర్వాలేదు. కానీ.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉపయోగించినప్పుడే ఈ ప్రమాదం జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందట. కారులో ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఉంచి… కారు కనుక ఎండలో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది.    ఎక్కువ ఎండలో ప్లాస్టిక్ వస్తువులను ఉంచితే… అవి మెత్తగా, సన్నగా మారతాయి. ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ విషయంలోనూ అదే జరుగుతుంది.  సూర్య కిరణాలు వాటిపై పడినప్పుడు, అవి చాలా సన్నగా మారుతాయి. దీని తరువాత, ఈ కిరణాలు కారు లోపల సీట్ కవర్లు, డ్యాష్‌బోర్డ్ మొదలైన వాటితో కూడిన తోలు భాగాలలో మంటలను కలిగిస్తాయి. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.    మరి, ఇలా మంటలు రాకుండా ఉండాలి అంటే.. సూర్యకిరణాలు నేరుగా పడే ప్రదేశంలో ఉంచకూడదని గుర్తుంచుకోండి. కారును పార్క్ చేస్తున్నప్పుడు వాటర్ బాటిల్‌ని తీసివేయండి.  ఇక కారును ఎండలో కాకుండా.. వీలైనంత వరకు నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయడం ఉత్తమం. అప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఇక… ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తో పాటు…  పెర్ఫ్యూమ్, ఆల్కహాల్, లైటర్, అగ్గిపుల్లలు మొదలైన వాటిని కారులో ఉంచకుండా ఉండటం మంచిది.

Leave A Reply

Your email address will not be published.