తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంగా భారీగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షానికి అవకాశం ఉందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. ఉదయం మేఘాలు కమ్మేసి సాయంత్రానికి వర్షం కురవొచ్చని చెప్పారు. మేఘాల కారణంగా తీవ్ర ఉక్కపోత ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో పగటివేళ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే బయటకు వెళ్లాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.