పార్టీ అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (MLC Jeevan Reddy) అలకబూనారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో అసనం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, సంజయ్‌ చేరికపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సోమవారం ఉదయం నుంచే జీవన్‌రెడ్డి ఇంటికి పార్టీ నాయులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఈ విషయమై పార్టీ అధిష్ఠానం ఆయనతో మాట్లాడుతున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే తన నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నదని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని తెలిపారు. ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనని స్పష్టంచేశారు. అయితే ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో జగిత్యాల రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.