తండ్రి స్నాప్ చాట్ వద్దన్నాడని బాలిక సూసైడ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ స్నాన్‌చాట్‌ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలిక తన ఫోన్‌ (mobile phone)లో స్నాప్‌చాట్‌ (Snapchat) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంది. ఇది చూసిన బాలిక తండ్రి ఆమెను సున్నితంగా మందలించాడు. స్నాప్‌చాట్‌ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని (hangs self) బలవన్మరణానికి పాల్పడింది.

ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్‌పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.