ప్రైవేటు పాఠశాలలో ఫీజుల పైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలి

- నసురుళ్లబాద్ భారతీయ జనతా పార్టీల మండల ప్రధాన కార్యదర్శి మేకల రామన్నా యాదవ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారతీయ జనతా పార్టీల నసురుళ్లబాద్ మండల శాఖ  ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మండలంలోని నసురుళ్లబాద్ మరియు మీర్జాపూర్ ,మైలారం, నెమలి గ్రామాలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల తరగతులను బహిష్కరించడం జరిగింది. అనంతరం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ  ప్రైవేటు పాఠశాలల ఫీజులపైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వాళ్ళ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు అన్నారు. పాఠశాలలు ప్రారంభించి రెండు వారాలు గడుస్తున్న పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.