రాజకీయాల్లోకి చిరు రీ ఎంట్రీ ?

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. మెగాస్టార్ జీవితం తెరిచిన పుస్తకం. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మెగాస్టార్ గా ఎదిగాడు. ఆయన గురించి  ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతే కాదు బాలీవుడ్ లో కపూర్స్  ఫ్యామిలీ ఎలాగైతే ఇండస్ట్రీలో పై స్థాయిలో ఉన్నారో.. టాలీవుడ్ లో  మెగాస్టార్ చిరంజీవి కూడా మెగా సాంమ్రాజ్యాన్ని స్థాపించారు.  మోక్షజ్ఞ కు పోటీగా మరో స్టార్ హీరో వారసుడు… బాలయ్య కు తలనొప్పిగా మారిన వారసుడి ఎంట్రీ..? సినిమాల్లోకి రావాలి అనుకుంటున్న ఎంతో మందికి మెగాస్టార్ ఆదర్శంగా నిలిచారు. ఇక ఆయన కుటుంబం నుంచి అరడజనుకు పైగా హీరోలు రాణిస్తున్నారు. ఇక చిరంజీవి గతంలో పొలిటికల్ స్టెప్ తీసుకున్నారన్న సంగతి కూడా తెలిసిందే. ప్రజారాజ్యం ద్వారా ఓ వేవ్ క్రియేట్ చేసి.. రాజకీయాల్లో అలా వచ్చి ఇలా వెంటనే యూటర్న్ తీసుకున్నారు. అయితే ఇన్నాళ్టికి మళ్ళీ మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ గట్టిగా నడుస్తోంది.    రామ్ చరణ్ కు ఆస్తి విషయంలో ఉపాసన షాక్..? మెగా కోడలి ఆస్తి ఎన్ని వేల కోట్లంటే..? ప్రస్తుతం చిరంజీవి పొలిటికల్ రీయంట్రి గురించి అంతట పెద్ద చర్చ జరుగుతోంది. పాలిటిక్స్ వదిలేసి.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి.. అవమానాలు ఎదుర్కోని… ప్రస్తుతం డిప్యూటీ సీఎం స్థాయికిఎదిగారు. దాంతో మెగాస్టార్ చిరంజీవి కూడా రీఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అంటున్నారు ఫ్యాన్స్.  సమంతను దూరం పెడుతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..? ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేశారుగా..? చిరంజీవి మళ్ళీ పొలిటిక్స్ లోకి వస్తారని..ఒక మంచి పదవి చేపడతారని  ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 2008 లో పార్టీ పెట్టి..2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో  పిఆర్పి  పోటీ చేసి.. 18 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయ్యింది. ఇక పార్టీ నడపడం సాధ్యం కాదు అని గ్రహించిన చిరంజీవి..  కాంగ్రెస్ తో విలీనం చేసేసారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కేంద్ర పర్యాటక మంత్రిగా పనిచేశారు చిరు.  నయనతారతో విభేదాలు నిజమే.. ఒప్పుకున్న త్రిష, గొడవలకు కారణం సినిమానేనా..?   ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయిన మెగాస్టార్  ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు అయితే రాజకీయ జీవితాన్ని ఆపేసిన చిరంజీవి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని టాక్. ఇందులో నిజం ఎంత అనేది చూడాల్సి ఉంది. అయితే మరో వాదన ఏంటంటే.. మెగాస్టార్ తో మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో చిరును ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.