ఎస్టీ జాబితాలో బోయలు వాల్మీకీలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:  వచ్చే ఎన్నికల్లో లాభపడేందుకు వీలుగా జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మూడు జిల్లాల్లో ఉన్న బోయలు వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని జగన్ నిర్ణయించారు. అయితే తన నిర్ణయాన్ని డైరెక్టుగా ఆచరణలోకి తేవటం సాధ్యంకాదు కాబట్టి అధ్యయనం కోసం ఏకసభ్య కమిటీని ప్రభుత్వం నిర్ణయించింది. తమను ఎస్టీలుగా గుర్తించాలని బోయలు వాల్మీకీలు ఎప్పటినుండో ఆందోళనలు చేస్తున్నారు.1956కి ముందు ఈ రెండు సామాజికవర్గాలు ఎస్టీల్లోనే ఉండేవి. అయితే ఆధ్రా రాజీయన్ ఎస్టీ ఎస్సీ సవరణ చట్టం ప్రకారం 1956 తర్వాత బోయలు వాల్మీకీలను ఎస్టీల జాబితాలో నుండి తొలగించారు. అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో పై రెండు సామాజికవర్గాల జనాభా సుమారుగా 50 లక్షలవరకు ఉంటుంది. వీరిలో అత్యధికులు మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళ మద్దతు తమకే ఉండేట్లుగా జగన్ పెద్ద ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది.ఇక్కడ విషయం ఏమిటంటే బోయలు వాల్మీకులు ఇపుడు బీసీ కేటగరిలోకి వస్తారు. అయితే ఇవే సామాజికవర్గాలు కర్నాటకలో ఎస్టీలుగా కంటిన్యు అవుతున్నారు. రెండురాష్ట్రాల్లోను పెద్దఎత్తున ఉన్న ఈ రెండు సామాజికవర్గాల మద్య సంబంధ బాంధవ్యాలు గట్టిగానే ఉన్నాయి.కర్నాటకలో ఎస్టీలుగా ఉన్న వాళ్ళు ఏపీలోకి రాగానే బీసీలుగా మారిపోతున్నారు. అలాగే ఏపీ నుండి అటువైపుకి వెళ్ళగానే ఎస్టీలైపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలన్నదే వీళ్ళ డిమాండ్.పోయిన ఎన్నికల్లో పై రెండు సామాజికవర్గాల నేతలు వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. అలాగే కొంతమందికి స్ధానికసంస్ధల్లో గెలవగా మరికొందరికి నామినేటెడ్ పోస్టులు కూడా దక్కాయి. కాబట్టి వీళ్ళ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవాలని జగన్ అనుకున్నట్లున్నారు.అందుకనే ఈ సామాజికవర్గాలను ఎస్టీలో చేర్చాలని నిర్ణయించారు. అయితే రిజర్వేషన్లు కేంద్రప్రభుత్వం పరిధిలోనివి. అందుకనే ముందుగా ఏకసభ్య కమీషన్ వేసి రిపోర్టు తెప్పించుకుని కేంద్రానికి పంపబోతున్నారు. మరక్కడ ఏమి జరుగుతుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.