చంద్రబాబుతో వేటి అయిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికీ పెండింగులోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సుమారు రెండు గంటల పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్మ అమ్మవారి దర్శనానికి గవర్నర్ రాధాకృష్ణన్ వెళ్లారు.

కాగా, ఆలయ మర్యాదలతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు అధికారులు, స్వాగతం పలకగా.. పూర్ణకుంభంతో ఆలయ వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం తెలంగాణ గవర్నర్ కు వేదా ఆశీర్వచనం అందజేసి.. అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని ఈఓ కేఎస్ రామారావు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఏపీ‌ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసాను అని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ విభజన అంశాలపై చర్చ ఏమీ జరగలేదు అని తేల్చి చెప్పారు. ఇక, చంద్రబాబు అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి.. ప్రత్యేకంగా ఎటువంటి అంశాలూ మా మధ్య చర్చకు రాలేదు.. విభజన అంశాలపై ఎటువంటి చర్చ జరగలేదు.. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.