భారతీయ న్యాయ సంహిత తొలి కేసు నమోదు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) కూడా జులై 1 నుంచి కొత్త బీఎన్ఎస్ చట్టం ప్రకారం తొలి కేసు నమోదైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ పరిధిలోని ఒక వీధి వ్యాపారి మీద కొత్త క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలోని ఒక వ్యాపారి రోడ్డు మీద వాటర్ బాటిళ్ళు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దానివల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దాన్ని వేరేచోటుకు తరలించమని అతనికి పోలీసులు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పోలీసులు వీడియోగా తీసి, కేసు నమోదు చేసినట్టు ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్నారు. అదేంటో, ఏ చట్టమైనా మొదట సామాన్యుల దగ్గరే బాగా పనిచేస్తుంది.

Leave A Reply

Your email address will not be published.