బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు తెరచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు ఎత్తనున్నారు. బాబ్లీ ప్రాజెక్టును తెలంగాణ -మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కేంద్ర జల సంఘం ప్రతినిధులు సందర్శించనున్నారు. ఈ రోజు తెరిచిన గేట్లను 120 రోజులపాటు అలాగే ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏటా జులై 1వ తేదీన ప్రాజెక్టు గేట్లు తెరవాలని.. అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లు ఎత్తే ఉంచాలని 2013 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28 వరకు అధికారులు గేట్లు తెరిచి ఉంచనున్నారు. ఈ క్రమంలోనే శ్రీరాంసాగర్‌లోకి వరద ప్రవాహం పెరగనుంది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.