నడి రోడ్డు పై ప్రత్యక్షమైన భారీ మొసలి

వనికిపోయిన ప్రయాణికులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. నది కూడా ఉప్పొంగింది. ఆ సమయంలోనే వరద నీటిలో నుంచి ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. కాసేపటి తరవాత నడిరోడ్డుపై కనిపించింది. వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కార్‌లో కూర్చున్న ఓ వ్యక్తి ఆ మొసలిని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికంగా శివా నది నుంచి రోడ్డుపైకి వచ్చుంటుందని భావిస్తున్నారు. ఆ నదిలో మొసళ్ల సంఖ్య ఎక్కువ అని స్థానికులు చెబుతున్నారు. అయితే ఉన్నట్టుండి అంత భారీ మొసలి రోడ్డుపైన పాకుతూ కనిపించే సరికి అంతా కంగుతిన్నారు.

Leave A Reply

Your email address will not be published.