తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. దీంతో.. అధికారులు జాబ్‌ క్యాలెండర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారని, రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.