కర్ణాటకను వణికిస్తున్న డెంగ్యూ వైరస్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కర్నాటక రాష్ట్రాన్ని డెంగ్యూ వైరస్‌ వణికిస్తోంది. బెంగళూరు సహా కర్నాటకను డెంగ్యూ కమ్మేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 24 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో కర్నాటక ప్రజల్లో అల్లాడిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కర్నాటకలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా.. బెంగళూరులో డెంగ్యూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కర్నాటక వ్యాప్తంగా 12వేల కేసులు నమోదైతే.. ఒక్క బెంగళూరు సిటీలోనే 12 వేల కేసులు నమోదు కావడం భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 286 డెంగ్యూ కేసులు గుర్తించబడ్డాయి. మొత్తం 52వేల214 మందికి బ్లడ్‌ టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డెంగ్యూ విజృంభణతో కర్నాటక ప్రభుత్వం అప్రమత్తం అయింది. డెంగ్యూ కేసులపై నిఘా ఉంచాలని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేష్‌ గుండూరావు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ సీఈవోలను ఆదేశించారు. వర్చువల్ మీటింగ్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆయన.. డెంగ్యూ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫీవర్ క్లినిక్‌లను తెరవాలని, అక్టోబర్ వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డెంగ్యూ హాట్‌స్పాట్‌లను గుర్తించాలని.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రానికి సూచించామన్నారు. వ్యాధి కార‌క ప్రాంతాల్లో జ్వరాల‌ ల‌క్షణాలు ఉన్న వారికి డెంగ్యూ ప‌రీక్షలు చేయించుకోవాల‌ని చెప్పారు. రానున్న రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి డెంగ్యూపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.