టైపు రైటింగ్ కు బై..బై

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఎంతో మందికి టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పించిన 200 ఏండ్లకు పైగా చరిత్ర గల టైప్‌ రైటింగ్‌ కోర్సులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. ఈ కోర్సులను మూసివేసే దిశలో సాంకేతిక విద్యాశాఖ అడుగులేస్తున్నది. టైప్‌ రైటింగ్‌ పరీక్షల స్థానంలో ఇక నుంచి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీటీబీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే జరిగితే స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, కోర్టుల్లో ప్రతీ ఏటా భర్తీచేసే వేలాది టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు మన విద్యార్థులు పోటీపడే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ శాఖల్లో టైప్‌రైటర్లు, స్టెనోగ్రాఫర్‌ పోస్టులు భర్తీచేయడంలేదు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులను మాత్రమే భర్తీచేస్తున్నారు. దీంతో టైప్‌ రైటింగ్‌ కోర్సులు అనవసరమన్న భావనతోనే మూసివేస్తున్నారు. దీనిని టైప్‌ రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.