బ్యాంకులు సేవా కేంద్రాలు కాదు ..  న్యాయమైన వడ్డీ వ్యాపార కేంద్రాలు మాత్రమే

..  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్

దేశంలో ముద్ర లోన్లతో పాటుగా అనేక రకాల సంస్కరణలు సామాన్యుల కోసం తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతే చేతివృత్తుల వారికి వివిధ చిన్న వ్యాపారస్తులకి న్యాయం జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అన్నారు గాజువాక బ్యాంక్ ఆఫ్ ఇండియా గాజువాక స్వర్ణకార సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ 2019 సంవత్సరంలో 89 మంది స్వర్ణకారులకు మూడు కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇవ్వడం జరిగిందని అన్నారు. వాటిని చెల్లించే క్రమంలో స్వర్ణకారుడు పొన్నాడ మని సుదర్శన్ 35 సంవత్సరాలు ఫిబ్రవరి 18 2022న ఆకస్మిక మృతి చెందడంతో  అతనికి ఇప్పించిన మూడు లక్షల 19 వేల రూపాయల లోన్ లో వడ్డీతో కలిపి 1,95,000 బ్యాంకు వారికి బకాయి ఉండడంతో బతికున్న రోజులు సంఘానికి విధేయుడుగా సంఘ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే మనిషి సుదర్శన్ మృతి పట్ల సంఘం నాయకులు చనిపోయిన తర్వాత కూడా మంచి వ్యక్తికి మాట రాకూడదని గాజువాక స్వర్ణకార సంఘంలో పనిచేసిన వారికి చనిపోయిన తర్వాత కూడా గౌరవం దక్కే విధంగా సంఘం పనిచేస్తుందని సంఘ అధ్యక్షుడు డొంక నానాజీ ప్రధాన కార్యదర్శి గుంటపల్లి ప్రసాద్ కోశాధికారి గోరస నానాజీ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణు మాధవ్ కు తెలియజేయడంతో గాజువాక బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ బివి ఆదిత్య తో సంప్రదింపులు జరిపి 1,95,000 వేల రూపాయలు బాకీ గాను ఒక లక్ష 20 వేల రూపాయలతో ఓటీఎస్ ద్వారా చెల్లించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణు మాధవ్ మాట్లాడారు. ఈరోజు సంవత్సరం ఆఫ్ ఇయర్లీ సందర్భంగా బ్యాంకు ఇన్చార్జి మేనేజర్ పి శివకృష్ణ గారికి 1,20,000 సొమ్మును చెక్కు ద్వారా బ్యాంకు వారికి చెల్లించడం పట్ల రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గత ఆరు సంవత్సరాలుగా దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వర్ణకారులకు క్లస్టర్ స్కీం ద్వారా ఎంఎస్ఏ ఈ ద్వారా ముద్ర లోన్లు ఇచ్చి స్వర్ణకారుల అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నాయని మొదట విడత మూడు లక్షలు రెండో విడత ఐదు లక్షలు మూడో విడత పది లక్షలు గా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణాలు పొంది ఆర్థిక అభివృద్ధికి ప్రతి స్వర్ణకారుడు రావడానికి దోహదం చేస్తుందని ఈ సందర్భంగా స్వర్ణకారుల యొక్క నిబద్ధతని ఇప్పటికే 96½ శాతం ఈఎంఐ రికవరీ ద్వారా స్వర్ణకారులు చెల్లిస్తున్నారని భవిష్యత్తులో అన్ని బ్యాంకులు కూడా న్యాయమైన వడ్డీకి వ్యాపార కేంద్రాలు వీటి ద్వారా స్వర్ణకారుడు పేరు చెబితే మొదటిసారి ఐదు లక్షలు రెండోసారి పది లక్షలు ఇచ్చే విధంగా బ్యాంకులు సిద్ధంగా ఉండే రోజులు త్వరలో చూస్తారని అక్టోబర్ 9న పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జరిగే అఖిల భారత స్వర్ణకార సంఘ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకారులకి బ్యాంకులు ఇస్తున్న విధివిధానాలను సమావేశంలో చర్చిస్తామని కర్రి వేణుమాధవ్ తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.