స్వర్ణకారుల అభివృద్దిలో భాగస్వామినవుతా

.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: నరసాపురం నియోజకవర్గం లో స్వర్ణకారుల కుటుంబాలకు అభివృద్దిలోనిసంక్షేమంలోని అండగా ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్ ముదునూరు ప్రసాదరాజు గారు అన్నారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపంలో ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణ కార్య సంఘ అధ్యక్షులు కర్రి వేణు మాధవ్ అధ్యక్షతన బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే 36 మాది స్వర్ణకారులకు రూ. 1 కోటి 15 లక్షల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ముద్ర లోన్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయినారు. ఈ సందర్బంగా ముదునూరు ప్రసాదరాజు మాట్లాడుతూ అభివృద్ది పనులపై విశ్వబ్రాహ్మణస్వర్ణకార కుటుంబాలకు అండగా ఉంటానని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు ప్రక్కన స్థలానికి సహకరిస్తానని, BCల అభివృద్దికి సహకరిస్తానని తెలిపారు.. సభ కు అద్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘ అధ్యక్షులు  కర్రి వేణు మాధవ్  మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి ముద్ర లోన్స్ స్వర్ణకార అభివృద్దికి బాటలుగా మారాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 2017 లో ఇండియన్ బ్యాంక్ వారు 2021 లో 14 పట్టణాలలో ముద్ర లోన్స్ ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందని లోన్లు తీసుకున్న స్వర్ణకారులు 96% నెలసరి వాయిదాలు జమ చేయడంతో అన్ని బ్యాంక్ లు స్వర్ణకారులకు లోన్స్ ఇచ్చే పరిస్థితి త్వరలో ఆసన్నమవుతుందని ప్రభుత్వ చీప్ విప్  ప్రసాదరాజు ద్వారా లబ్ధిదారుల వాటా 10% రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేసినారు. ఈ సంధర్భంగా స్థానిక స్వర్ణకార అధ్యక్షులు కొమ్మోజు తాయి వెంకటరత్నంవిశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుకణితి నాగ వెంకట రమేష్ బాబు  ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి నల్లగొండ వెంకట రామకృష్ణ లకు  నరసాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వై. వెంకటేష్ గారు 1 కోటి 17 లక్షల చెక్కును ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజురాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ చేతుల మీదుగా చెక్కు విడుదల చేసినారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా స్వర్ణకార సంఘ కన్వీనర్ పొన్నాడ బ్రహ్మానందం, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి ముంగండ శివగణేష్, రాష్ట్ర స్వర్ణకార సంఘ నాయకులుకొడమంచిలి ఉపసర్పంచ్ ములగాడ వరప్రసాద్, స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వాడ ప్రసాద్ , విశ్వబ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి కొమ్మోజు గోపి శ్రీనివాస్స్వర్ణకార సంఘం కోశాధికారి పట్నాల రమేష్విశ్వ బ్రాహ్మణ సంఘ కోశాధికారి కర్రి నాగ మల్లేష్ విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు కొమ్మోజు మోహన వెంకట రత్నం,  గోపాస్న వెంకటరమణతమరి రాఘవాహకారయులుకిల్లాడ వెంకట శ్రీనివాస్మొగడా సత్యనారాయణమారోజు వెంకటరమణచింతాడ సతీష్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.