రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా బిసిలు ఉద్యమించాలి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్:  పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వత్వరలో చేపట్టబోయే జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుదాకర్ ముదిరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. దేశ జనాభాలో 50 శాతం జనాభా గల బీసీలకు ఇప్పటికీ ఏ రంగంలో కూడా ప్రజాస్వామ్య వాటా లభించలేదని,బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీసీ సంఘాలు చిన్న,చిన్న రాయితీల కోసం సమయం వృధా చేసుకోకుండా రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంకు నాయకత్వం వహించి ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల వారు కొన్ని వేల సంవత్సరాలుగా తమ కుల వృత్తుల ద్వారా దేశ సంపద సృష్టించి – సమాజాన్ని బతికించారునడిపించారు.  నేడు ప్రజాస్వామ్యవస్థలో జీవిస్తున్నాం అన్ని కులాలకుసామాజిక వర్గాలకు జనాభా ప్రకారం విద్య,ఉద్యోగ,ఆర్థికరాజకీయ,సామాజిక,వ్యాపారవాణిజ్యపారిశ్రామికకాంట్రాక్టర రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి కానీ 75 సంవత్సరాల కాలంలో ఏ రంగంలో కనీస వాటా కూడా లభించలేదు. దేశ సంపద సృష్టించారు కానీ సంపదలో వాటా లభించలేదుపన్నులు కట్టారు కానీ బడ్జెట్ వాటా లభించలేదుఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకున్నారు కానీ అధికారం వాటా ఇవ్వడం లేదుపార్టీలు మాటున అధికారం చాటున అగ్రకులాలు బీసీ కులాలను అణిచిపెట్టారు. గత 75 సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వాలు బీసీలను అణచిపెట్టారుబిచ్చగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు. రాజకీయ పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సుదాకర్ విమర్శించారు. పేరుకే మనది ప్రజాస్వామ్య దేశం కాని ఆచరణలో ధనస్వామ్య దేశంగా మారిపోయిందని విమర్శించారు. డబ్బున్న పారిశ్రామిక వేత్తలువ్యాపారస్తులుకాంట్రాక్టర్లు డబ్బులతో పార్టీ టికెట్లు కొనిడబ్బులతో ఓట్లు కొని ఆ తర్వాత ఎన్నికైన పదవిని డబ్బు సంపాదనకు ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు..స్వాతంత్ర్య  భారతంలో బి.సి లకు రాజకీయంగా కనిస ప్రాతినిధ్యం లభించడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం గత 75 సంవత్సరాల గణాంకాలు పార్లమెంట్ సభ్యులుశాసన సభ్యులుకేంద్ర-రాష్ట్ర మంత్రులు వివరాలు సేకరిస్తే బి.సి ల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదు. గత 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో 56 శాతం జనాభా గల బి.సి లకు 14 శాతం ప్రాతినిధ్యం దాటలేదంటే రాజకీయ రిజర్వేషన్లు పెట్టవలిసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. అంతేకాదు. 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక పార్లమెంట్  సభ్యులు లేరు. ఈ ప్రజాస్వామ్య స్పూర్తి ఎక్కడ కనిపిస్తుందని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమాధనస్వామ్యమాఅని ప్రశ్నించారు. తెలంగాణా లో 119 యం.యల్.ఏ. లు ఉంటే బి.సి లు కేవలం 21 మంది మాత్రమె ఉన్నారు. ఇంత తక్కువ ప్రాతినిధ్యం చూస్తే ఇదెలా ప్రజాస్వామ్యమవుతుంది. 56 శాతం జనాభా గల బి.సి లకు ప్రాతినిధ్యం ఏదని ప్రశ్నించారు. బి.సి లు ఓట్లు వేయడానికేనా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలు మారాలి. పేదరికం ఆకలి అనుభవించిన వారు చట్ట సభలోకి వస్తే వాటి రూపుమాపే చట్టాలు వస్తాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.