ఈ సారి మనకు సూర్యగ్రహణం ప్రభావం ఉంటుందా?

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం దీపావళి తర్వాత రోజైన అక్టోబరు 25న వస్తోంది.
అయితే సాధారణంగా సూర్యగ్రహణం (Surya Grahan 2022) అమావాస్య రోజే ఏర్పడుతుంది. అందుకే ఈ నెల 25న ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణమే అంటున్నారు. ఈ గ్రహణంలో సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు.
అందుకే దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. సూర్యగ్రహణ కాలంలో దేశంలోని అన్నీ ఆలయాలు మూసివేయనున్నారు. ఈసారి ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఐరోపా, యురల్స్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికా యొక్క ఈశాన్య ప్రాంతాల నుండి కనిపిస్తుంది.

భారతదేశంలో ఈ గ్రహణం సూర్యాస్తమయానికి ముందు ప్రారంభమవుతుంది. అండమాన్-నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల నుండి ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు.

భారతదేశంలోని వాయువ్య ప్రాంతాల్లో గ్రహణం ఎక్కువ సేపు కనిపించే అవకాశం ఉంది. పాక్షిక సూర్యగ్రహణాన్నే ఆంషిక్ సూర్య గ్రహణం అని కూడా పిలుస్తారు. తదుపరి సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది భారతదేశం నుండి కూడా కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖల్లో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుంచి గ్రహణాన్ని చూడవచ్చు అంటున్నారు. అది కూడా చాలా పాక్షికంగానే కనిపించనుంది. సుమారు 49 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని కానీ.. వచ్చేఏడాది వచ్చే సూర్యగ్రహణం ప్రభావం పూర్తిగా మన దేశంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గ్రహణం కారణంగా 25వ తేది నాడు గ్రహణ కాలంలో అన్నీ ఆలయాలు మూసివేయనున్నారు. గ్రహణకాలం అనంతరం ఆలయాల శుద్ధి కార్యక్రమం నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అంతేకాదు ఈ గ్రహణం సమయంలో్ తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. కొన్ని పనులు చేయకూడదు అంటారు.

సూర్యగ్రహణం కారణంగా గ్రహణ కాలంలో కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు.అంటే గ్రహణం ప్రారంభమయ్యేలోపే భోజనం ముగిసేలా చూసుకోవాలి. గ్రహణ సమయంలో దానం, జపం చేసే వాళ్లు ప్రారంభ సమయంలో పట్టుస్నానం చేయాలి. అలాగే గ్రహణం పూర్తయ్యాక విడుపు స్నానం చేయాలి అని పండితులు చెబుతారు.

 

Leave A Reply

Your email address will not be published.