బెంగళూరులో అక్టోబర్‌ 7నుంచి ప్రారంభంకానున్న వివో ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 9

.. తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌తో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 9

అపూర్వ విజయం సాధించిన ప్రో కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) సీజన్‌8 ఇచ్చిన స్ఫూర్తితో సీజన్‌9 బెంగళూరులో అక్టోబర్‌ 07 నుంచి ప్రారంభం కానుంది. గ్రీన్‌కో గ్రూప్‌ కోఫౌండర్‌ ఛైర్మన్‌  శ్రీ శ్రీనివాస్‌  శ్రీరామనేని తో పాటుగా ఎన్‌ఈడీ గ్రూప్‌కు  చెందిన  శ్రీ మహేష్‌  కొల్లిశ్రీ గౌతమ్‌ రెడ్డి లు  తెలుగు టైటాన్స్‌  సీజన్‌ 9 నూతన టీమ్‌ను పరిచయం చేశారు.తెలుగు టైటాన్స్‌ టీమ్‌ (సీజన్‌ 9)  – రవీందర్‌ పహల్‌ (కెప్టెన్‌)సిద్దార్ధ్‌ దేశాయ్‌అంకిత్‌ బెనివాల్‌ మోను గోయత్‌ రజ్నీష్‌అభిషేక్‌ సింగ్‌ వినయ్‌సుర్జీత్‌ సింగ్‌ విశాల్‌   భరద్వాజ్‌పర్వేష్‌ భైంశ్వాల్‌విజయ్‌ కుమార్‌ఆదర్శ్‌ ప్రిన్స్‌నితిన్‌రవీందర్‌మోహిత్‌,  హనుమంతుముహమ్మద్‌   షిహాస్‌ పళ్ల రామకృష్ణ,  మోహసేన్‌ మగసౌద్లూహమీద్‌ నాడర్‌అంకిత్‌మోహిత్‌  పహల్‌ మరియు రిజర్వ్‌ ప్లేయర్‌గా సుమిత్‌.

తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని శ్రీనివాస్‌ శ్రీరామనేని మాట్లాడుతూ ‘‘గత సీజన్‌ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ  సీజన్‌ను విజయవంతంగా మలుచుకోవడానికి  ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మా నూతన స్క్వాడ్‌  కి పూర్తి శిక్షణను మా కోచింగ్‌ సిబ్బంది అందించారు. రాబోయే సీజన్‌లో  అభిమానులకు  గర్వకారణంగా మా టీమ్‌ నిలవాలని ఆకాంక్షిస్తున్నాము. మీ అందరి మద్దతు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని శ్రీ నేదురుమల్లి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్‌ 9 వివో ప్రో కబడ్డీ లీగ్‌ ప్రారంభిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా టీమ్‌ను గత సీజన్‌తో పోలిస్తే సమూలంగా మార్చాము. ఇప్పుడు మా టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటుగా నూతన యువ ఆటగాళ్లు కూడా  ఉన్నారు. వెంకటేష్‌ గౌడ్‌ మరియు మన్జీత్‌ల కాంబినేషన్‌ ఖచ్చితంగా టీమ్‌కు కప్‌ను అందించగలదని నమ్ముతున్నాము. ఈ సంవత్సరం కప్‌ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్‌ పోటీపడటంతో పాటుగా  తెలుగు టైటాన్‌ స్ఫూర్తిని పునరుద్ధరించనుంది’’ అని అన్నారు.తెలుగు టైటాన్స్‌ కోచ్‌ శ్రీ వెంకటేష్‌ గౌడ్‌  మాట్లాడుతూ ‘‘పర్వేష్‌ భైంశ్వాల్‌విశాల్‌ భరద్వాజ్‌సూర్జీత్‌ సింగ్‌ మరియు రవీందర్‌ పహల్‌లు టీమ్‌లో ఉండటం వల్ల తెలుగు టైటాన్స్‌  శక్తివంతమైన డిఫెన్స్‌ బృందాన్ని సెటప్‌ చేసింది. వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలకమైన ఆటగాళ్లు. తెలుగు టైటాన్స్‌ తమ ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 9 (పీకెఎల్‌9) మ్యాచ్‌ను అక్టోబర్‌ 07న  ఈ నూతన సీజన్‌ ప్రారంభంలో భాగంగా బెంగళూరు బుల్స్‌తో  బెంగళూరులోని  శ్రీ కంఠీరవ ఇండోర్‌ స్టేడియంలో ఆడనుంది’’ అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.