ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించిన ఏఎస్సై

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్/ నసురుల్లాబాద్:  కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బాన్సువాడ – నిజామాబాద్ ప్రధాన రహదారి వద్ద మండలంలోని గ్రామంలో గ్రామ శివారులో నసురుల్లాబాద్ ఏఎస్సై అబిద్ బేగ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు, మైనర్లకు వాహనం ఇవ్వరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ. డ్రైవింగ్ చేయరాదని అత్యవసర సమయంలో తప్ప 100 కి ఫోన్ చేయవద్దని ఏదైనా సమస్య ఉంటే నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని గంజాయి , లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నసురుల్లాబాద్ గ్రామ శివారులో ఎక్కువగా మూలమలకులు ఉండడంతో ఘోర రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో అతివేగంగా వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనం నడపరాదని, హెల్మెట్ పెట్టుకొని బైక్ డ్రైవింగ్ చేయాలి, ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు, మైనర్ బాలికలపై ఎలాంటి వేధింపులు జరిగిన షీ టీం కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు, అమ్మాయిలు ఆకతాయిలతో జాగ్రత్తగా ఉండాలని తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకూడదని ఎవరైనా ఆకతాయిలో అమ్మాయిలపై అగైత్యాలు చేస్తే 100 నెంబర్ కి ఫోన్ చేయాలి, లేదా నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు, మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ ప్రజలు కొందరు గ్రామస్తులు అత్యవసరం కాకుండా విపరీతంగా 100 డయల్ కి ఫోన్ చేస్తున్నారు , ఏఎస్సై అబిద్ బేగ్ అన్నారు, అత్యవసర సమయంలో తప్ప 100 డయల్ నెంబర్ కి కాల్ చేయగలరని చిన్న చిన్న వాటికి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు, మైనర్ బాలికలకు వివాహం చేయరాదని అయినా అన్నారు కార్యక్రమంలో కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, సతీష్, రాము, పోలీస్ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.