బాన్సువాడ డిఎస్పీగా కే. జగన్నాథరెడ్డి
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: బాన్సువాడ డిఎస్పీగా కే జగన్నాథరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. లోగడ పనిచేసిన వి జైపాల్ రెడ్డి కామారెడ్డి వి ఆర్ కు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో హైదరాబాద్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహించిన జగన్నాథ రెడ్డిని బాన్సువాడకు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.