పోలీస్ శాఖ ఆద్వర్యంలో వ్యాసరచన పోటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ లోని విద్యర్టులకు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పోలీసులను గుర్తుచేసుకుంటూ అక్టోబర్ 21 న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణ పోలీస్ నిర్వహించే ఆన్‌లైన్ వ్యాస రచన పోటీలో( తెలుగు / ఉర్దూ / ఇంగ్లీషులో)  నిర్వహించనున్నట్లు నసురుల్లాబాద్ ఎస్ ఐ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది 2 విభాగాలలో నిర్వహించబడుతుంది. మొదటి విభాగం 5 తరగతి నుంచి  టర్మీడియట్ విద్యార్థులకు వ్యాస రచన అంశం: “రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పౌరుల పాత్ర”

రెండవ విభాగం:
డిగ్రీ మరియు ఆపై విద్యార్థులకు వ్యాస రచన అంశం: “సైబర్ నేరాలను నిరోధించడంలో పౌరులు మరియు పోలీసుల పాత్ర మీ వ్యాసాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి క్రింది పద్దతిని(steps) అనుసరించాలని సూచించారు. 1. సబ్మిట్ చేయటానికి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి. https://forms.gle/y5kk13WkPQYvgfW16

2. మీ పేరు, తరగతి మరియు ఇతర వివరాలను నమోదు చేయండి
3. మీ వ్యాసాన్ని పేర్కొన్న ప్రదేశంలో పదాల పరిమితి మించకుండా సమర్పించండి.
4. మీ వ్యాసాన్ని సమర్పించడానికి చివరి తేదీ 24-10-2022

జిల్లా / కమిషనరేట్‌లో ఎంపిక చేసిన ఉత్తమ మూడు వ్యాసాలకు సంబంధిత పోలీసు సూపరింటెండెంట్ / పోలీసు కమీషనర్లు బహుమతి ప్రదానం చేస్తారు మరియు ఆ వ్యాసాలను సంబంధిత జిల్లా / కమిషనరేట్ అధికారిక సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేయటం జరుగుతుందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.