రాజధాని నగరంలో నకిలీ నోట్ల కలకలం

ఆందోళనకు గురవుతున్న ప్రజలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాజధానిలో నకిలీ నోట్ల కలకల… తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపుతుంది. సనత్ నగర్ పోలీసు ఠానా పరిధిలోని తులసి నగర్ ప్రాంతంలో నూతనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి వంద రూపాయల నోటును పోలిన నకిలీ నోట్లను తయారుచేసి కొంతమంది వ్యక్తులు మార్కెట్లో ప్రజలను బురిడీ కొట్టించి చలామని చేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే తులసి నగర్ ప్రాంతానికి చెందిన మట్టపల్లి సోమక్క తన కుమారుడు మధు వద్ద ఆటో చార్జీల కోసం వంద రూపాయలు తీసుకొని రోజువారి లాగే హౌస్ కీపింగ్ పనిచేసేందుకు షేర్ ఆటోలో శనివారం ఉదయం హైటెక్ సిటీ ప్రాంతానికి వెళ్ళింది. తాను గమ్యం చేరుకున్న అనంతరం ఆటో డ్రైవర్ కు చార్జీల కోసం డబ్బుల చెల్లింపు తరుణంలో 100 రూపాయల నోటు ను డ్రైవర్ కు అందజేసింది. వంద రూపాయల నోటు తీసుకున్న డ్రైవర్ వంద రూపాయల కరెన్సీ నోటును పరిశీలించగా అది నకిలీదని గుర్తించి ఈ నోటు తనకు వద్దని చెప్పడంతో వెంటనే సదరు సోమక్క ఒకేసారి అవాక్కయింది.

తనతో పాటు పనిచేసే మరో మహిళ జయలక్ష్మి ఇది గమనించి తన వద్ద ఉన్న డబ్బులను సదరు ఆటో డ్రైవర్ కు చార్జీలు చెల్లించింది .అనంతరం వారు నకిలీ కరెన్సీ విషయాన్నీ తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ ప్రతినిధికి దృష్టికి తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా నకిలీ కరెన్సీ చలామని చేసే అక్రమార్కులు అదేపనిగా నకిలీ నోట్ల చలామణి కోసం వయసు పైబడ్డ మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకోవడంతో పాటు విద్యాబుద్ధులు తెలియని వారితో మార్కెట్లో చలామని చేస్తున్నట్లు సమాచారం. నకిలీ కరెన్సీ విషయంలో మోసపోయిన ప్రజలు సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెప్పాలంటే కేసుల కోసం ఠాణాల చుట్టూ తిరగవలసి వస్తుందని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నకిలీ కరెన్సీ చలామని చేసే వ్యక్తులను పోలీసు అధికారులు గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తులసి నగర్ వాసులు కోరుతున్నారు. నకిలీ కరెన్సీ విషయమై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.. సనత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ ను నకిలీ కరెన్సీ చలామణి విషయమై తెలంగాణ వెబ్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా నకిలీ కరెన్సీ చలామణి ఈ విషయం ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని ఏదైనా సమాచారం అందితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన సమాధానం ఇచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.