తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మపండుగ

బతుకమ్మ సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని,  పూలను  పూజించడం  గొప్ప సంప్రదాయం తెలంగాణా ప్రజలదని బౌద్దనగర్ డివిజన్ కార్పొరేటర్ కండి శైలజ అన్నారు. బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని బౌద్దనగర్ డివిజన్ లోని కమ్యూనిటి హాల్ ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యం లో ఏర్పాటుచేసిన బతుకమ్మ పండుగ సంబరాలకు ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా శైలజ మాట్లడుతి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ బతుకమ్మ ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. దేశం లో ప్రతీ  చోట  పూలతో  పూజలు  చేస్తారని కానీ  ఒక్క తెలంగాణ లోనే బతుకమ్మ  ఆట  ద్వారా పూలను  పూజించే  గొప్ప సంప్రదాయం ఉంది అని అన్నారు.అనంతరం టిఆర్ఎస్ నాయకురాలు ,తెలంగాణా పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి బల్ల గీత మాట్లాడుతూ  ముక్యంగా ఆంధ్రప్రదేశ్ లో కుడా మహిళలు బతుకమ్మ ఆటలను ఆడుతున్నరంటే ఈ పండుగకు ఉన్న విశిష్టతకు నిదర్శనమన్నారు. బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని, మహిళల సాంస్కృతిక వికాసం ఆవిష్కరించేది బతుకమ్మ పండుగ గొప్పదమన్నారు.బతుకమ్మకు ముందుగా  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మల చుట్టూ  ఆడిపాడి విద్యార్థినుల్లో  ఉత్సాహం నింపారు.  ఈకార్యక్రమంలో  మానస,యాదమ్మ,సులోచన,యాద లక్ష్మి,సుమతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.