ఈటలకు షాక్: టీఆర్ఎస్‌లోకి ఏనుగు రవీందర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్వామిగౌడ్, దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరికొందరు నేతలు గులాబీ గూటికి చేరబోతున్నారు.

అయితే ఈటల రాజేంధర్ ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీని వీడనున్నారని ఊహాగానాలు వస్తోన్నాయి. ఇదీ బీజేపీకే కాక.. ఈటల రాజేందర్‌కు షాక్.

ఏనుగు రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్‌తో కలిసి పార్టీని వీడారు. ఈటలతో తుల ఉమ, తదితర ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను పార్టీ పెద్దగా పట్టించుకోలేదు.

2018 ఎన్నికల్లో ఓటమి.. 2018 ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోగా.. తనకు నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించారు. అదీ జరగలేదు. పైగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి జాజాలా సురేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం బాధ్యతలను టీఆర్ఎస్ నాయకత్వం సురేందర్‌కు అప్పగించింది. ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. అప్పుడు పార్టీని వీడటానికి ఇదీ కూడా ఒక కారణమే

Leave A Reply

Your email address will not be published.