టెలికాం రంగంలో మొదలైన కొత్త శకం

దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో జీ సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించాడు. ఢిల్లీ ప్రగతి భవన్ మైదాన్లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ –2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. దీంతోపాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు.  ఈ శనివారం నుంచి దేశంలో జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.5జీ సేవల సామర్థ్యాన్ని డెమోను రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ స్వయంగా మోడీకి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోడీ స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే అమెరికా చైనా దక్షిణ కొరియా ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడ ఈ సేవలు కొన్ని పట్టణాలకే పరిమితమయ్యాయి. మన దేశంలో తాజాగా లాంచ్అయ్యింది.దేశంలో ఏఏ నగరాల్లో 5జీ సేవలుదేశంలో తొట్టతొలుత 5జీ సేవలను ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభించారు. వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు.  తొలి దశలో అహ్మదాబాద్ బెంగళూరు చండీగఢ్ చెన్నై ఢిల్లీ గాంధీనగర్ గురుగ్రామ్ హైదరాబాద్ జామ్ నగర్ కోల్ కతా లక్నో ముంబై ఫుణే నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో ప్రస్తుతం నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.