ఉత్తమ రచనలు ఇతర భాషలోకి అనువాదం కావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వివిధ ప్రాంతాల్లో ఉన్న సాహిత్యం ఆ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఉత్తమ రచనలు ఇతర భాషలోకి ముఖ్యంగా ఆంగ్లంలోకి అనువాదం కావాలని  ప్రముఖ కవులు, సాహితీ వేత్తలు అభిప్రాయపద్దరు. మానస ఆర్ట్ థియేటర్స్ ఆద్వర్యం లో కళా సుబ్బారావు కళావేదికపై భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకొని బహుభాషా కవి సమ్మేళనం జరిగింది. బైస దేవదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అఖిలభారత భాషా సాహిత్య సమ్మేళన్ అధ్యక్షులు ఆచార్య కటారి సత్యమూర్తి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ భారతదేశం వివిధ భాషలు సమ్మేళనమని,అబ్దుల్ కలాం వంటి మహనీయులు ఈ దేశం లో పుట్టి దేశ సమగ్రత సమైక్యతలకు ప్రతీకగా నిలిచారన్నారు. గణ సభ అధ్యక్షులు కళా జనార్దన్ మూర్తి కవి, అంబల్లళ్ళ జనార్ధన్ జి సోమసుందర్ తదితరులు పాల్గొన్న సభకు రఘు శ్రీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి కోరుప్రోలు మాధవరావును హిందీ రచయిత నటుడు సుభాషింగును అబ్దుల్ కలాం స్మారక పురస్కారులతో అతిధులు సత్కరించారు. ఈ కార్యక్రమం లో కడియాల ప్రభాకర్, చిక్కా రామదాసు, బొల్లిముత వెంకటరమణ, శోభారాణి, చల్లపల్లి ఆంజనేయులు, ఆర్ ప్రవీణ్, కె అరుణ, వెంకట సత్యమూ,ర్తి వి ఆర్ ఆర్ సోమయాజులు, డాక్టర్ దేవసేన, టీ జనార్ధన్, డాక్టర్ నాగేశ్వరరావు , శారద  తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ళ చిరంజీవి ప్రజ్ఞాన్ ఆలపించిన దేశభక్తి గీతం సభికులను ఎంతో ఆకట్టుకుంది.

Leave A Reply

Your email address will not be published.