Adi Purush: ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ‘ఆది పురుష్‌’ టీజర్‌ విడుదల ఆ రోజే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) అభిమానులతోపాటు యావత్‌ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆది పురుష్‌’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం కావటంతో ప్రారంభం నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఫ్యాన్స్‌ ఎదురుచూశారు. ఎంతకీ స్పందించకపోవటంతో సోషల్‌ మీడియా వేదికగా కొందరు చిత్ర బృందంపై ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, త్వరలోనే టీజర్‌ లాంఛ్‌ అవుతుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది. ఆ అప్‌డేట్లు ఏ తేదీన వస్తాయో చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) అధికారికంగా ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.