తెలంగాణ పునర్నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది

..రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వేబ్ న్యూస్: భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందిస్తున్నామని, తెలంగాణ పునర్నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో  ఆదివారం నిర్వహించిన మర్రిగూడెం మండలం శివన్నగూడెం, కమ్మగూడ, దేవర భీమనపల్లి వాసుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతు గత ప్రభుత్వాల హయాంలో భూనిర్వాసితులకు అరకొర సాయం, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు.  ఏదుల రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారంతో పాటు మంచి ఆర్ & ఆర్ ప్యాకేజీ ప్రాజెక్టుల మూలంగా భూములు కోల్పోయిన వారికి దానివల్ల లాభపడ్డ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఎవరో ఒకరు త్యాగం చేయనిది ఒక నిర్మాణం పూర్తిచేయలేం శివన్నగూడెం నిర్వాసితులకు న్యాయం చేసేందుకు నా వంతు కృషిచేస్తా అన్నారు. ఏ సమస్య నా వద్దకు తీసుకొచ్చినా పరిష్కరించేందుకు నా సహకారం ఉంటుంది. తెలంగాణ రైతుల కష్టాలు చూసి న్యాయవాద వృత్తిని పక్కనపెట్టి తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమించాను, స్వయంగా మా నాన్నతో వ్యవసాయం మాన్పించి భూములు అమ్మించాను, ఆ తర్వాత ఆయన ఆవేదన చూసి తిరిగి భూములు కొని వ్యవసాయం చేశా అని తెలిపారు. తీవ్రమైన కరువులో పశువులకు , బర్లకు నీళ్లు లేని పరిస్థితి, గడ్డి దొరకని పరిస్థితిలో వాటిని సాకలేక వచ్చిన ధరకు వాటిని అమ్మేశాను, 26 వేలకు ఎకరా చొప్పున పది ఎకరాలు అమ్మేశాను .. అది ఇప్పుడు ఎకరా మూడు కోట్లు పలుకుతుంది, తెలంగాణలో 2014కు ముందు 20 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా ప్రశాంతంగా బతకలేదు .. అసలు బతకడానికి అవకాశం లేదని తెలిపారు. పిల్లల పెండ్లిళ్లకో, ఇతర అవసరాలకో భూములను 20 వేలకు, 30 వేలకు అమ్ముకున్నారు ఈ పరిస్థితిలే తెలంగాణ ఉద్యమానికి పురిగొల్పి ఉద్యమించి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించేలా చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఢోకా లేదు అని తెలిపరి. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ, రైతు అనుకూల విధానాలు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నది. పంటల ఉత్పత్తిలో నేడు తెలంగాణ నంబర్ వన్ గా నిలుస్తున్నది. ఒకప్పుడు మార్కెట్లకు ధాన్యం తెస్తే హమాలీలు దించడానికి వెంటపడేది .. నేడు ధాన్యం వస్తే హమాలీలు లేక, లారీలు లేక పడిగాపులు కాయాల్సి వస్తున్నది తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా నిలిచింది, నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బారినపడి 2 లక్షల మంది జీవితాలను నష్టపోయారు. నేడు మునుగోడులో సకల అవసరాలకు ప్రభుత్వం మిషన్ భగీరధ నీళ్లను అందుబాటులో ఉంచింది, నేడు తెలంగాణలో ప్రతి కుటుంబం ప్రభుత్వం నుండి ఏదో రూపేణా లబ్దిపొందుతున్నది. చెరువులు పునరుద్దరించి ఉచిత చేప పిల్లలతో మత్స్యకారులకు చేయూతనందించాం, మంచినీటి చేపల ఉత్పత్తిలో నేడు తెలంగాణ నంబర్ వన్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.