అంతంపేట్ లో దీపావళి సంబరాలు జరుపుకున్న బండి సంజయ్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మర్రిగూడ (గట్టుప్పల్) మండలం అంతంపేట గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు,ఎంపీ బండి సంజయ్ కుమార్ దీపావళి సంబురాలు జరుపుకున్నారు. బీజేపీ కార్యకర్త పెద్దబోయిన సతీష్ గౌడ్ నివాసంలో కాకరొత్తులు, భూచక్రాలు కాల్చి దీపావళి సంబరాలు జరుపగా గ్రామస్తులు బండి సంజయ్ వద్దకొచ్చి సంతోషంగా దీపావళి సంబురాలు చేసుకున్నారు. చిన్నపిల్లలతో కలిసి బండి సంజయ్ కుమార్, గంగిడి మనోహర్ రెడ్డి, తూళ్ళ వీరేందర్ గౌడ్ లు దీపావళి సంబరాలు జరిపారు.