చిరంజీవితో కలిసి రవితేజ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

చిరంజీవి కథానాయకుడిగా ఇటీవల వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. సినిమాలో ఆయన పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఎంట్రీ ఇస్తుంది. సెకాండాఫ్ లో చిరూ .. సల్మాన్ మధ్య ఒక సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే పద్ధతి చిరంజీవి 154వ సినిమాగా రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోను కొనసాగనుంది. కాకపోతే ఈ సినిమాలో చిరంజీవితో రవితేజ కనిపించనున్నాడు.

మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి సవతి తల్లి కొడుకు పాత్రలో రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ రవితేజ ఎంట్రీ పై ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవిని సపోర్టు చేసే ఈ పాత్రలో రవితేజ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. చిరూ – రవితేజ కాంబినేషన్లో ఒక మాస్ మసాలా సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని చెబుతున్నారు. చిరువూ – రవితేజ స్టెప్పులు మెగా ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తాయని అంటున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, కేథరిన్ .. రాజేంద్ర ప్రసాద్ .. వెన్నెల కిశోర్ .. బాబీ సింహా ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.