కార్నర్ పాయింట్ ను పరిశీలించిన శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ నాయుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ నెల 30, 31వ తేదీల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జాతీయ బైపాస్ రహదారి 44 వద్ద అన్నారం చౌరస్తాలో కార్నర్ పాయింట్ ను శంషాబాద్ డివిజన్ ట్రాఫిక్ విభాగ ఏసిపి శ్రీనివాస్ నాయుడు పరిశీలించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ తో కలిసి రిసివింగ్ కార్నర్ వద్ద మాట్లాడారు.
రాహుల్ గాంధీ వెంట దాదాపు 50 కంటైనర్లు, 500 మంది ప్రత్యేక బలగాలు ఉంటాయని పేర్కొన్నారు. వాహనాలను పార్కింగ్ చేసే స్థలాలు సమీక్షించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వేలాదిమంది జనాలు వస్తున్నారని వారికి కూడా ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ దాదాపు 25 వేల మందితో కార్నర్ రిసివింగ్ జరుగుతుందని ఇక్కడ వేదికపై రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. వీర్లపల్లి శంకర్ వెంట స్థానిక నాయకులు బాబర్ ఖాన్, రఘు, అందే మోహన్, జగదీశ్వర్, వీరేశం, బాలరాజ్ గౌడ్, ఖదీర్, నవాజ్ గోరి, సింగారం సుదర్శన్, సత్తయ్య, నెహ్రూ నాయక్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.