మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు మూడంచెల భద్రత ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోకి డబ్బుమద్యం డంప్ కాకుండా వంద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తుండడంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 60, రాచకొండ పరిధిలో 40 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్ పోస్టు వద్ద ఇద్దరు ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. కోట్ల 65 లక్షల నగుదు, 1480 లీటర్ల మద్యం పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికను పకడ్బందిగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.