పెళ్లికోసం ఇంత పని చేశాడా..వామ్మో

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన, మధురమైన ఘట్టం.  అందుకే వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవాలని.. ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. తమకు ఉన్నంతలో అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి కోసం దొంగతనాలు చేస్తున్నాడు.  తన పెళ్లి గురించి నలుగురు మాట్లాడుకునేలా వైభవంగా చేసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం అవసరమైన డబ్బును.. చోరీలు చేసి సంపాదిస్తున్నాడు.  ఒడిశాలో వరుస దొంగతనాలను పాల్పడుతున్న ఈ వెరైటీ దొంగను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
ఒడిశాలోని  ఖోర్దా జిల్లా శారదాపూర్‌కు చెందిన నిశాంక్ (33).. బీబీఏ చదివాడు. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని సౌభాగ్య నగర్ కాలనీలో నివసిస్తూ.. ఓ ఫుడ్ డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే నిశాంక్‌కు వివాహం నిశ్చమయింది. డిసెంబరు పెళ్లికి మహూర్తం ఖాయమైంది. తన వివాహాన్ని ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాడు నిశాంత్. పెళ్లి కోసం ఎవరైనా కష్టపడి డబ్బులు కూడబెడతారు. కానీ ఇతడు మాత్రం దొంగతనాలు చేస్తున్నాడు. షర్ట్‌లు, షూల్ నుంచి బంగారం నగల వరకు.. తన పెళ్లికి కావాల్సిన వస్తువులన్నింటినీ.. చోరీలు చేసి సేకరిస్తున్నాడు. భువనేశ్వర్‌లో ఇటీవల ఇలాంటి దొంగతనాలు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. పగటి పూటనే ఎక్కువగా దొంగనాలు జరగడం.. అది కూడా ఓ వ్యక్తి ఎవరికి గుర్తుపట్టకుండా.. హెల్మెట్ ధరించి..బైక్‌పై పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సీసీ ఫుటేజీల్లో బయపటడింది. బైక్ నెంబర్ ఆధారంగా వ్యక్తిని నిశాంక్‌గా పోలీసులు గుర్తించారు.
అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో దర్యాప్తు చేస్తే.. అసలు నిజం బయటపడింది. నగరంలో కొన్ని చోట్ల ఇటీవల జరుగుతున్న దొంగతనాలు.. మనోడు చేసిన పనే అని తేలింది. తన పెళ్లి కోసమే ఈ వస్తువులను చోరీ చేసినట్లు చెప్పడంతో.. పోలీసులు షాక్ అయ్యారు. పెళ్లి కోసం దొంగతనం చేయడమేంట్రా.. అని నోరెళ్లబెట్టారు. అతడి నివాసంలో భారీ మొత్తంలో వస్తువులు లభ్యమయ్యాయి. 230 బ్రాండెడ్ జీన్స్, 25 జతల బూట్లు, మహిళల లో దుస్తులు, 450 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.25 లక్షల వరకు ఉంటుంది. ఈ వస్తువులను అమ్మి.. ఆ డబ్బుతో తన వివాహాన్ని ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాడు. కానీ అంతలోనే పోలీసులకు చిక్కాడు.
గతంలో కూడా దొంగతనాలను పాల్పడిన నేర చరిత్ర అతడికి ఉందని పోలీసులు తెలిపారు. తన గర్ల్ ఫ్రెండ్‌కి బహుమతులు ఇవ్వడానికి ఎక్కువగా చోరీలకు పాల్పడ్డానని వెల్లడించారు. అతడిపై మొత్తం 18 దొంగతనం కేసులు నమోదయ్యాయని.. వాటన్నింటినీ అతడు అంగీకరించాడని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.