సొంత కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్

.. గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

ఐదేళ్లు పోరాటం చేయమని కత్తిస్తే మధ్యలో వదిలేసి సొంత కాంట్రాక్టుల కోసం పారిపోయి అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

సంస్తాన్ నారాయణపురంలో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్.

ఐదేళ్లు మునుగోడు ప్రజల హక్కుల కోసం పోరాడమని ఓటేసి కత్తిస్తే మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని, నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి లేకపోవడం చూస్తే బాధేస్తుందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బుధవారం స్థానికంగా జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు.

మునుగోడును ఏనాడు పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం 18 వేల కాంట్రాక్టుల కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ గద్దలకు గులామ్ చేసి వంచించాడని, మునుగోడు జీవ ప్రధాయిని అయిన మేళ్లచెరువును, శివన్న గూడెం గాలికొదిలేసి అవినీతి రాజకీయాలు చేస్తున్న బిజెపి అభ్యర్థి మనకు అవసరమా అని ప్రశ్నించారు. మళ్లీ సువర్ణ ఆకాశంలా వచ్చిన ఈ ఎన్నికల్ని ఉపయోగించుకోవాలని ప్రతీ ఒక్క ఓటు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ మొదలు ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్య మంత్రి వరకు మన సమస్యల్ని చెప్పుకొని పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏనాడూ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మునుగోడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవకుండా సొంత రాజకీయాలు, కాంట్రాక్టులు చేసిన వ్యక్తి మళ్లీ గెలిచినా అదే చేస్తాడని దుయ్యబట్టారు మంత్రి గంగుల.

సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడ ఏ బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలోనూ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తుందని గతంలో బిడ్డ పెళ్లి కోసం పుట్టింటికి వెళ్ళి సొంత అన్నను అడిగిన సాయం చేయలేదని కానీ కెసిఆర్ గారు ఎవరు అడగకుండానే బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్నారని తొలుచూరు కాన్పుకు సైతం కేసీఆర్ కిట్ని అందించడమే కాకుండా వెనుకబడిన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వెయ్యికి పైగా గురుకులాలతో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్నారని ఇలా సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్కు మనమందరం అండగా ఉండాలన్నారు. కడుపునిండా తిన్న తర్వాత దివేనార్థులు ఇచ్చే తెలంగాణ నైజాన్ని మనందరం గుర్తుంచుకోవాలని, ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని సంస్థాన్ నారాయణపురం తో పాటు మునుగోడు సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, స్థానిక జడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేశం గౌడ్, ఎంపీపీ ఉమా ప్రేమ్చంద్రారెడ్డి, గౌడ సంఘం నాయకులు పాలకొల్లు యాదయ్య గౌడ్, గంగాపురం శ్రీరాములు గౌడ్, నీళ్ల నరసింహాగౌడ్, నీళ్ల గాలయ్య గౌడ్, మోగుదాల సత్తయ్య గౌడ్, పందుల యాదగిరి గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో గౌడ సంఘం మహిళలు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.