బిజెపి, తెరాసలకు మునుగోడు అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు

.. టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు లో జరుగుతున్న ప్రచార సరళిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, బీజేపీ, టీఆరెస్ అభ్యర్థులు కొత్తవారు కాదు గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారే అయిన నిజంగా వారు మునుగోడును అభివృద్ధి చేయాలనుకుంటే మునుగోడు పరిస్థితి వేరేలా ఉండేదని టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుదవారం మునుగోడులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడును అభివృద్ధి చేయాలనే ఆలోచన బిజెపి, తెరాసలకు లేదని,

ఇంకో ఎనిమిదేళ్లయినా డిండి ప్రాజెక్టును పూర్తి చేయలేరు అన్నారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. గిరిజనుల భూములను సినిమా వాళ్లకు కట్టబెట్టాలని కేటీఆర్ చూస్తున్నారు అన్నారు. గిరిజనులను అనాధలను చేయాలనే కుట్ర జరుగుతోంది, సమస్యలు చర్చకు రాకుండా బీజేపీ, టీఆరెస్ లు గందరగోళం సృష్టిస్తున్నాయి. చదువు కోవాల్సిన పిల్లలను మద్యానికి బానిసను చేస్తున్నారు. యువతను తాగుబోతులుగా మారుస్తున్నారు. మద్యం, డబ్బుల ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది, టీఆరెస్, బీజేపీ లు కాంగ్రెస్ ను చంపాలని చూస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు పిలుపుణిస్తున్న మునుగోడుకు తరలి వచ్చి కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా నిలవండి అని కోరారు. సర్వేలలో బీజేపీకి మూడో స్థానం రావడంతో రాజగోపాల్ కు చలి జ్వరం వచ్చింది. టీఆరెస్, బీజేపీ కుట్రలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ నెల 30న షాద్ నగర్ కు జోడో యాత్ర చేరుకుంటుంది. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ యాత్రలో పాల్గొనాలి అని సూచించారు. నవంబర్ 1న మునుగోడు మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు మహిళా గర్జన కార్యక్రమం ఉంటుందని, మునుగోడు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు మహిళా గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం మక్తల్ లో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. 27 నుంచి నవంబర్ 7 వరకు భారత్ జోడో యాత్ర సాగుతుంది. తెలంగాణ బిడ్డలుగా ఒక్కరోజైనా రాహుల్ పాద యాత్రలో పాల్గొనాలని  రేవంత్ రెడ్డి కొరకు.

Leave A Reply

Your email address will not be published.