రవీంద్రభారతిలో31వ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యంగా వయో వృద్ధులుదివ్యాంగులు ఇబ్బంది పడవద్దన్న మంచి ఆలోచనతో ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి.. దేశంలోనే అత్యధిక మందికి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. 31వ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రవీంధ్రభారతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ముందుగా హోంమంత్రి మంత్రి మహమూద్ అలీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వందేళ్లు పై బడిన పలువురు వృద్ధులను మంత్రులు సన్మానం చేశారు. జీవితంలో వృద్దాప్యంలో ఉన్నవారు సంతోషంగా.. ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని మంత్రి కొప్పుల సూచించారు. వృద్ధాప్యంలో నిరాధరణకు గురవుతున్న వారిని ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు రాష్ర్టంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఓల్డ్ ఏజ్ హోంలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొప్పుల చెప్పారు. 33 జిల్లాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని..ఇందు కోసం నిధులు కూడా మంజూరు అయ్యాయని తెలిపారు. ఒంటరి తనం అనేది భయంకరమైనదన్నారు. పెద్దలను గౌరవించిన కుటుంబాలు ఉన్నత స్థాయిలో ఉంటున్నాయన్నారు. కొందరు తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకొనకున్నా..ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు తప్ప ఎవరికి చెప్పుకోవడం లేదన్నారు. వృద్ధుల కోసం ప్రత్యేకమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న విషయాన్ని వారివారి కుటుంబ సభ్యులు గ్రహించాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన చట్టాలపై ఒక పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్ధి దశ నుంచే తల్లిదండ్రుల పోషణ బాధ్యతలు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీపై ఏ విధంగా అవగాహన కల్పించామో.. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు సహా బహిరంగంగా వృద్ధుల చట్టం గురించి విస్తృత ప్రచారం కల్పించి అవగాహన కల్పాంచాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. చట్టాలు పాటించని వారిపై శిక్షాస్మృతిని అమలు చేయాలన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులోనూ సభ్యులు చర్చించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఇచ్చారు. తల్లిదండ్రుల ఆస్తిని పిల్లల పేరుపై రాసి ఇచ్చే వీలునామా వెనక్కి తీసుకునే విధంగా ఒక అమెండ్ మెంట్ తీసుకు వచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. ముఖ్యంగా వృద్దాప్యంలో వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వచ్చే వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. కోవిడ్ సమయంలో దాదాపు వెయ్యి శవాలను దగ్గరుండి దహన సంస్కరాలు చేపట్టిన అన్నా ఫౌండేషన్ నిర్వాహకులు అన్నా శ్రీనివాస్ ,  పదవీ విరమణ పొంది ఎటువంటి గౌరవ వేతనం లేకుండా విద్యాభోదన చేస్తున్న వెంకటాచారిని మంత్రి కొప్పుల అభినందించారు. విదేశాల్లో ఉంటున్న వారిలో కొందరు దేవాలయాల నిర్మాణం.. స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహణ చేపడుతున్న విధంగా రెసిడెన్షియల్ స్కల్ విధ్యార్ధుల సహాయానికి కూడా చేయూత అందించినట్లయితే వారికి మేలు చేసినవారవుతారన్నారు. సమాజ మనుగడ కోసం ప్రతి ఒక్కరు సేవా దృక్పదంతో ముందుకు సాగాలని సూచించారు. వృద్ధుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14567 పోస్టర్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఇదే టోల్ ఫ్రీ నెంబర్ ను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు.గతంలో పెన్షన్ కోసం వృద్ధులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేదని.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి పెన్షన్ వచ్చేలా చేశారని చెప్పారు. అంతే కాదు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ను 2016కు పెంచి వృద్ధులకు ఆసరా కల్పించారని అన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలవారిని ఆదుకుంటున్నారని మహమూద్ అలీ చెప్పారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డిసీనియర్ సిటిజన్లు నాగేశ్వర్ రావుపార్థసారధినర్సింగ్ రావుదయాకర్ రావుగోపాల్ రెడ్డి దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ సహా పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.