స్వేచ్ఛగా ప్రజాభిప్రాయ లు వెల్లడించే హక్కు ఏపి లో లేదా?

.. సీపీఐ( యం ఎల్) పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భూమి,బుక్తి,పీడిత ప్రజల విముక్తి కోసం వేలాది మంది విప్లవ కారులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ,వారిని స్మరిస్తూ మరియు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల దోపిడీ,రాజ్య హింసలకు,పేదల హక్కుల కోసం విప్లవ ఐక్య ఉద్యమాల నిర్మాణం కోసం పార్టీ శ్రేణులు కృషి చెయ్యాలని సీపీఐ( యం ఎల్) పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు నిచ్చారు.కేంద్రంలో మోడీ,ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి,తెలంగాణలో కెసిఆర్ నియంత లా పాలనను కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు . అమరావతి రైతులు,మహిళలు చేస్తున్న పాదయాత్రకు అడుగు అడుగున అడ్డంకులు కలిగిస్తూ ఉక్కుపాదం,అక్రమకేసులు మోపడం పోలీసు లకు తగదని,ఏ పి లో నడిచేది ప్రజాస్వామ్యమాపోలీస్ రాజ్యమా అని మండి పడ్డారు ,ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు లు అధికార పార్టీకి అనధికార కార్యకర్తలుగా వ్యవహరించడం  పార్టీలకు అతీతంగా వ్యేవహరించవస్లిన పోలీసులు వైసిపి పార్టీకి అడుగులకు మాడుగులోత్తడం సరి కాదన్నారు.స్వేచ్ఛగా ప్రజాభిప్రాయ లు వెల్లడించే హక్కు ఏపి లో లేదాఅన్నారు.రాష్ట్ర ప్రభుత్వనికి,పోలీస్ యంత్రాoగనికి  న్యా య వ్యవస్థ పట్ల,ప్రజాస్వామ్యం పట్ల గౌరవమ్ముంటే అమరా వతి రైతుల పాదయాత్ర సజావుగా సాగేలా చూడాలి అని ఆయన డిమండ్ చేశారు. కేంద్రం లో మోడీ తో కలిసి పని చేస్తున్న వైసిపి,తెరాస ప్రభుత్వాలు ప్రజా వేతిరేక విధానాలను విడనాడాలని లేని పక్షంలో ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబడలని  ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.