యాంటీ గ్రూప్ టార్గెట్ : రోజా ఆశలన్నీఎండమావిలేనా….?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంత్రి రోజా యాంటీ గ్రూప్ టార్గెట్ చేసిఉంది. దీనితో రోజా ఆశలన్నీఆవిరేనా….?అన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఇప్పటికి నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు. ఆమె టీడీపీ నుంచి 2004 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చూసారు. ఆ తరువాత ఆమె టీడీపీని విమర్శిస్తూ ఆ పార్టీని వీడారు. తరువాత  జగన్ వైపుగా వచ్చారు. అలా 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ గా గోల్డెన్  లెగ్ అనిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో రెండవసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే నగరి లో రోజా మెజారిటీ ఎపుడూ మూడు వేల లోపుగానే ఉంది అని లెక్కలు చెబుతున్నాయి.ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచినా కూడా రోజాకు మెజారిటీ 2వేల 708 కి మించలేదు. ఆమెకు 80 వేల 333 ఓట్లు వస్తే టీడీపీ నుంచి పోటీలో ఉన్న గాలి భానుప్రకాష్ కి 77 వేల 625 ఓట్లు వచ్చాయి. అంటే ఎంత టఫ్ ఫైట్ నడిచిందో వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఇక రోజాకు నగరిలో సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం బలంగా ఉంది. ఈ వర్గమంతా రోజా అభ్యర్ధిత్వం వద్దు అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో అయితే జగన్ స్వయంగా జోక్యం చేసుకుని ఆమెకు టికెట్ ఇప్పినిచారని చెబుతారు.ఇక గెలిచిన తరువాత రోజా వ్యతిరేక వర్గాన్ని కలుపుకుని పోలేదని ఫలితంగా ఆ వర్గం మరింత బలంగా ఆమెకు ఎదురు నిలిస్తోందని అంటున్నారు. ఇక నగరిలో ఎస్సీలు  బీసీలు ఓట్లతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓట్లు కూడా ఏకంగా పదహారు గ్రామాలలో ఉన్నాయి. దాంతో సామాజికవర్గ సమీకరణలు బాగా వైసీపీకి కలసివస్తున్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గాల ఓట్లు 15 గ్రామాలలో ఉంటే క్షత్రియ సామాజిక వర్గ ఓట్లు 13 గ్రామాల్లో అత్యధికంగా ఉంటాయహి లెక్కలు చెబుతునాయి. ఇక వీటిలో అత్యధిక శాతం వారు వైసీపికి వ్యతిరేకంగా ఉండడం రోజాకు మైనస్ అవుతుందని అంటున్నారు.ఇవి ఇలా ఉంటే సొంత పార్టీలో రోజాకు యాంటీగా నాయకులు మండలాల వారీగా ఉన్నారని అంటున్నారు. నిండ్ర మండలానికి చెందిన చక్రపాణిరెడ్డి వైసీపీలో  సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకు నగరి నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉందని చెబుతారు.ఆయన మంత్రి రోజాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.  ఇక  విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతి రాజు కూడా రోజాకు వ్యతిరేకంగానే పని చేస్తున్నారని ప్రచారంలో ఉంది. మరో కీలక నేత నగరి మునిసిపాలిటీకి చెందిన కేజీ కుమార్ మొదటి నుంచి రోజాకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. అలగే వనమాల పేటకు చెందిన మురళీధర్ రెడ్డి అన్న బలమైన నేత కూడా రోజా యాంటీ కూటమిలోనే ఉన్నారు.వీరంతా ఈసారి రోజా అభ్యర్ధిత్వం వద్దు అని గట్టిగానే పట్టుబడుతున్నారని సమాచారం. . వీరంతా ఇటీవల సమావేశమై రోజాకు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రచారంలోకి వచ్చిన విషయం. ఈ నేపధ్యంలోనే రోజా పూర్తి ఆవేదనకు గురి అయ్యారు ఆమె సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వెళ్ళగక్కారు. తనకు సొంత పార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారని ఆమె వాపోయారు. ఇలా నగరిలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా రోజాకు కనుక టికెట్ ఇస్తే ఆమె గెలుపునకు ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.అవేంటి అంటే ఆమె ప్రత్యర్ధిగా ఉన్న గాలి భానుప్రకాష్ టీడీపీలో ఒంటెద్దు పోకడలతో పార్టీలో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారుట. ఆయన అభ్యర్ధితవాన్ని స్వయగ్నా తమ్ముడు జగదీష్ అన్నకే యాంటీగా పనిచేస్తున్నారని అంటున్నారు. దాంతో పాటు భానుప్రకాష్ ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని మరీ తన రాజకీయాన్ని తాను చేస్తూండడంతో టీడీపీలో మిగిలిన వారు ఇబ్బందులు పడుతున్నారుట. అయితే అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన కనుక నచ్చచెప్పి టీడీపీకి ఏకత్రాటి మీద నడిపిస్తే కనుక రోజాకు ఇబ్బందుకు తప్పవని అంటున్నారు.ఇక వైసీపీలో రోజా కూడా వ్యతిరేక వర్గాన్ని కలుపుకుని పోవడానికి ప్రయత్నాలు చేస్తేనే  టికెట్ దక్కుతుంది అని అంటున్నారు. అయితే ఆమెకూ వ్యతిరేక వర్గానికి మధ్య దూరం బాగా పెరిగిన నేపధ్యంలో వైసీపీ హై కమాండ్ జోక్యం చేసుకున్నా కలిసేది ఉండదని అంటున్నారు. మొత్తానికి చూస్తే రోజాకు మాత్రం ఈసారి గెలుపు ఈజీ కాదనే లెక్కలు చెబుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.