గరుడ వాహన సేవకు తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తింది. తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. దాదాపు 4.50 లక్షల మంది గరుడవాహన సేవను తిలకిస్తారని టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు. భక్తులందరికి గరుడ వాహన సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సంఖ్య విశేషంగా ఉండటంతో తిరుమల గిరులు స్వామివారి నామంతో మార్మోగిపోతున్నది. గరుడ వాహన సేవలో దాదాపు 4.50 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే నాలుగు లక్షల మేర భక్తులు తిరుమలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గరుడ వాహనసేవ సందర్భంగా 5 వేల మందితో పోలీసులు భద్రత నిర్వహిస్తున్నారు. గ్యాల‌రీల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్నప్రసాదాలుతాగునీరు ఇవ్వనున్నారు. మాడ వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవలో స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేక గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి. చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమల చేరిన గొడుగులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.గరుడ వాహన సేవకు చేపట్టిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. మాడ వీధులుగ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని సుబ్బారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు భక్తులతో మాట్లాడి టీటీడీ సేవల గురించి ఆరా తీశారు. వాహనసేవను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశిత మార్గాల ద్వారా వెలుపలికి వెళ్లేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌భద్రతా సిబ్బందికి సూచించారు. కాగాగరుడ వాహనసేవకు యాత్రికులు పోటెత్తుతుండటంతో రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులను కొండపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లే ప్రైవేటు వాహానాలను అలిపిరి టోల్‌గేట్‌ వద్దే పోలీసులు నిలిపివేస్తున్నారు. దాంతో అలిపిరి నుంచి కపిల తీర్థం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Leave A Reply

Your email address will not be published.