డర్టీబాంబు వాడితే అది అణ్వాయుధ ఉగ్రవాదమే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉక్రెయిన్‌ డర్టీ బాంబ్‌ను వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. కీవ్‌లో ఆ బాంబు గురించి గుసగుసలు వినిపిస్తున్నట్లు రష్యా పేర్కొంటోంది. సంప్రదాయ పేలుడు పదార్ధాలతో అణుధార్మికత కలిగిన డర్టీ బాంబును ఉక్రెయిన్‌ రూపొందిస్తున్నట్లు రష్యా ఆరోపించింది. ఈ అంశంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగూ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై సెర్గీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ రెచ్చగొడుతున్నట్లు ఆయన రాజ్‌నాథ్‌కు వెల్లడించినట్లు తెలుస్తోంది.డర్టీ బాంబు గురించి రష్యా రక్షణ మంత్రి సెర్గీ ఆదివారం నాటో దేశాల రక్షణ మంత్రులతో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమ దేశాలు ఆ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. రేడియోయాక్టివ్‌ డర్టీ బాంబును వాడేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉన్నట్లు రష్యా చేస్తున్న ఆరోపణల్ని నాటో దేశాలు ఖండించాయి. రష్యానే ఆ బాంబును వాడనున్నట్లు నాటో దేశాలు ప్రత్యారోపణలు చేశాయి.ఉక్రెయిన్‌ వార్‌లో ఎవరు కూడా అణ్వాయుధాలను వాడరాదు అని సెర్గీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. న్యూక్లియర్‌ లేదా రేడియోలాజికల్‌ వెపన్స్‌ వాడడం అంటే అది మానవాళికి విరుద్దమే అని రాజ్‌నాథ్‌ అన్నారు. సంప్రదింపులుదౌత్యం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని రష్యా రక్షణ మంత్రికి రాజ్‌నాథ్‌ సూచించారు.అయితే అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ(ఐఏఈఏ) ఉక్రెయిన్‌లో ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లనున్న సమయంలో.. డర్టీ బాంబు ప్రణాళికల్ని ఉక్రెయిన్‌ గోప్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ డర్టీ బాంబును వాడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ డర్టీబాంబు వాడితే అది అణ్వాయుధ ఉగ్రవాదమే అవుతుందని యూఎన్‌ అభిప్రాయపడింది.

Leave A Reply

Your email address will not be published.