మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఓటర్లే కీలకం

.. .. గెలుపు ఓటములు నిర్ణయించేది వారే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. వివరాల ప్రకారం మునుగోడు, చండూరు, మర్రిగూడ, సంస్థాన్‌ నారాయణపూర్‌, నాంపల్లి, చౌటుప్పల్‌, గట్టుప్పల్‌ 7 మండలాలు కలుపుకుని 2,20,520 మంది ఓటర్లు ఎన్నికల కమిషషన్‌ విడుదల చేసిన జాబితాలో ఉన్నారు. కాగా ఈ ఓటర్‌ జాబితాలో 15.94 శాతం 35,150 ఓట్లు గౌడసామాజిక వర్గం కాగా 15.37 శాతం 33,900 ఓట్లు ముదిరాజ్‌, 9.69 శాతం 21,360 యాదవ, 5.30 శాతం పద్మశాలి 11,680 మంది ఓటర్లు, 3.56 శాతం 7,850 కుమ్మరి, 3.55 విశ్వబ్రాహ్మణ 7820, వడ్డెర 3.79, 8350 ఓటర్లు, ఎస్సీ మాదిగ 11.63, 25,650. ఎస్టీ లంబాడి, ఎరుకల 4.77, 10,520 ఓటర్లు, ఎస్సీ మాల 4.69, 10,350 ఓటర్లు, రెడ్డి 3.49, 7,690. మైనార్టీలు 3.47, 7,650. కమ్మ సామాజిక వర్గం 2.58, 5,680. ఆర్య,వైశ్య 1.71. 3,760 మంది ఓటర్లు, వెలమ 1.07. 2,360 ఓటర్లు, మున్నూరుకాపు 1.07. 2,350 మంది ఓటర్లు, ఇతరులు 8.34. 18,400 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సామాజికవర్గాల వారీగా ఓటుబ్యాంకు ఈ విధంగా ఉంది. వీటిలో మెజార్టీ ఓటుబ్యాంకు గౌడ, యాదవ, ముదిరాజ్‌ బీసీ సామాజిక వర్గం వారి ఓటు బ్యాంకు అధిక ఆధిక్యంలో ఉండడంతో ఈ వర్గాల వారు పూర్తి మద్దతు ఏ పార్టీకి సహకరిస్తే వారు విజయదుంధుబి ఈ ఉప ఎన్నికలో మోగించే అవకాశాలు సమృద్దిగా ఉన్నాయి. దీంతో భారతీయ జనతాపార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు బీసీ సామాజిక వర్గం ఓటర్లను తమకు తోచిన రీతిలో ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ ఉప ఎన్నికలో ఒక్కో ఓటుకు 12,000ల రూపాయల వరకు ముట్టజెప్తున్నట్లు సమాచారం. ప్రతీ వంద మందికి 5 గురు వ్యక్తులను నియమించి ఒక్కో వ్యక్తికి 20 మంది ఓటర్లను రాజకీయ నాయకులు నగదు, మద్యం పంపిణీ చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలంటూ జోరుగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదిఏమైనప్పటికి ఈ మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల భవిష్యత్తు ఈ ఎన్నికతో ముడిపడి ఉంది.

Leave A Reply

Your email address will not be published.