జహీరాబాద్ ఎంపీ కేవలం సమావేశాలకే పరిమితమా?

.. ఎంపీ నిధులతో అభివృద్ధి శూన్యం .. బీదర్, బోధన్ రైల్వే లైన్ కల సహకారం అయ్యేనా..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్:  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు కేంద్రం నుండి అభివృద్ధికి నిధులు మంజూరు అవుతున్నప్పటికీ కేవలం ప్రాంతీయ పార్టీ సభ్యులుగా వ్యవహరించడంతో అభివృద్ధి శూన్యం. నియోజకవర్గానికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భీంరావ్ బస్వంత్ పాటిల్ ఆయన నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారంగానే ఒక ఎంపీ పని చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే గడచిన తొమ్మిదేళ్ళ పాలనలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్రం నిధులతో అభివృద్ధి జరిగిందేమి లేదు. గతంలో బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల పరిధిలోని బరంగేడిగి బహిరంగ సభలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయినా బోధన్ బీదర్ రైల్వే లైన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని సభాముఖంగా ఎంపీ బీబీ పాటిల్ తెలిపినప్పటికీ ఏళ్లు గడిచినా నేటి వరకు ప్రారంభం కాకపోవడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎంపీ బీబీ పాటిల్ బిజెపి పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికైనా ఎంపీ బీబీ పాటిల్ తన తీరు మార్చుకొని కేంద్రం నుండి విడుదల నిధులతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.