సినిమాల రూపంలో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా జగన్ ప్లాన్ ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ద్రుష్టి లోప పెట్టుకొని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ హీట్ ఓ రేంజులో నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ.. ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా మారిపోయింది.ఎవరికీవారు తగ్గెదేలే‘ అన్నట్లుగా సవాళ్లు.. ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని మరింత రంజుగా మారుస్తున్నారు. వచ్చే ఎన్నికలు అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. జనసేన పార్టీలకు చాలా కీలకంగా మారాయి. టీడీపీ ఈసారి అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ భవిష్యత్తులో కోలుకోవడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 వైసీపీనే గెలుచుకోవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు తగిన కార్యాచరణతో ముందుకెళుతున్నారు. ఈ ఎన్నికలు జనసేనకు సైతం చావోరావో అన్నట్లుగా మారాయి. గత ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన జనసేనాని ఈసారి మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.దీంతో ఈసారి ఏపీలో త్రిముఖ పోటీ ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు పార్టీలను ప్రజలు సమానంగా ఆదరిస్తే మాత్రం జనసేనాని‘ కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ తాజాగా రాంగోపాల్ వర్మను తన క్యాంపు ఆఫీసుకు పిలిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది.రాంగోపాల్ వర్మ తొలి నుంచి జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు‘.. ‘వంగవీటి‘.. లక్ష్మీస్ ఎన్టీఆర్‘..  వంటి టీడీపీ వ్యతిరేక సినిమాలను తెరకెక్కించి ఆ పార్టీ ఇమేజ్ కొంతమేరకు డ్యామేజ్ చేశారు. అలాగే పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఎన్నికల తర్వాత పవర్ స్టార్‘ అనే సినిమాను తీసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వర్మతో సీఎం జగన్ భేటి అయినట్లు తెలుస్తోంది. మరోసారి సినిమాల రూపంలో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు వర్మ త్వరలోనే ఓ మూడు సినిమాలను తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే వర్మకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.వీటిలో రెండు సినిమాలు ప్రత్యర్థి పార్టీలపై డైరెక్ట్ అటాక్ మోడ్లో ఉంటాయని తెలుస్తోంది. ఇక మూడోది అధికార పార్టీని ఎలివేట్ చేసేలా.. జగన్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు.. విజయాలను బేస్ చేసుకొని సినిమా ఉండనుందట. ఈ సినిమాకు జగన్నాథ రథ చక్రాలు‘ అనే టైటిల్ కూడా ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈసారి జగన్ వదిలే బాణం వర్మ‘ బాణమేనా అంటూ జనాలు చర్చించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.